ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లో మరణించడం కలకలం రేపుతోంది. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు పోలీస్ లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. .గురువారం జరిగిందీ ఘటన.
Lockup death : ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లో మరణించడం కలకలం రేపుతోంది.గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు పోలీస్ లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ( ఏప్రిల్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
షేక్ సోను అనే యువకుడిని గంజాయి కేసులో కడప టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిపై అతనిని విచారించిన పోలీసులు ఆ తర్వాత లాకప్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే మనస్థాపానికి గురైన సోను లాకప్ లోని బాత్ రూమ్ గ్రిల్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే పోలీసులు స్టేషన్ కు తీసుకు వచ్చేటప్పటికే సోను అనారోగ్యంతో ఉన్నాడని, స్టేషన్ లో ఆరోగ్యం మరింత క్షీణించగా సోనును హాస్పిటల్ కి తరలించామని పోలీసులు తెలిపారు.అక్కడ చికిత్స పొందుతూ సోను మరణించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సోను అనారోగ్యంతో మరణించలేదని పోలీసులు హింసిచడం వల్లే బాధభరించలేక లాకప్ లో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!