ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది.
170 కేసులను స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
చిత్తూరు ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్రెడ్డికి చెందిన కారు షెడ్డుపై వన్ టౌన్ పోలీసులు, ఎస్ఈబీ అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం దాడి చేసింది. ఆ సమయంలో షెడ్డులో ఉన్న వ్యక్తిని విచారించగా తాను స్వీపర్న్న, ఈ షెడ్డు డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డిదని చెప్పడంతో అధికారులు దానిని వీడియో తీసుకున్నారు. 170 కేసుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.10.28 లక్షలు ఉంటుందని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు. సరకును చిత్తూరు అర్బన్ ఎస్ఈబీ అధికారులకు అప్పగించామని, రాజేష్రెడ్డిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం