March 13, 2025
SGSTV NEWS
Spiritual

శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం చేయలేనివారు… ఈ 40 నిముషాలు కేటాయించండి చాలు!


Maha Shivratri 2025: ఆరోగ్యం బాలేనివారు, గర్భిణిలు…శివరాత్రి రోజంతా ఉపవాసం, జాగరణ చేయాల్సిన చేయలేరు. అయితే ఇలాంటి వారికోసమే ఈ 40 నిముషాలు.. అత్యంత అపురూపం అయిన ఈ  ఆ సమయం ఏంటంటే

Lingodbhavam Timings in 2025 Date: 2025 ఫిబ్రవరి 26 బుధవారం శివరాత్రి (Maha Shivratri 2025) ఈ రోజు లింగోద్భవ కాలం బుధవారం అర్థరాత్రి 12 గంటల 9 నిముషాల నుంచి 12 గంటల 57 నిముషాల వరకూ.. ఈ రోజు మొత్తం మీద 40 నిముషాల సమయం అత్యంత ముఖ్యమైనది. 

మహా శివరాత్రి రోజు.. భక్తులు రోజంతా ఉపవాసం, జాగరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు , గర్భిణులు జాగరణ, ఉపవాసం చేయలేకపోతే బాధపడొద్దు.  లింగోద్భవ సమయాన్ని ప్రత్యేకంగా పాటించండి. లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని అర్చించగలిగితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం పొందుతారు.

లింగోద్భవం ఎందుకంత ప్రత్యేకం అంటే.. బ్రహ్మ-విష్ణు మధ్య నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని పోటీపడతారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు శివుడు. ఈ సమయాన్నే లింగోద్భవ సమయం అంటారు. శివరాత్రి మొత్తం ఏం చేసినా చేయకపోయినా లింగోద్భవ సమయం చాలా ముఖ్యం..

లింగోద్భవ సమయంలో శివపంచాక్షరి మంత్రం జపించండి, పంచామృతాలతో కానీ, నీటితో కానీ అభిషేకం చేయండి. ఈ లింగోద్భవ సమయం 40 నిముషాలూ శివుడిని ధ్యానించండి. ఈ సమయంలో సృష్టిమొత్తం శివలింగమే అని అర్థం. ఆ సమయంలో శివలింగం పైనుంచి అమృతధార కురుస్తుంది. అంటే విశ్వమంతా శివలింగమే అయినప్పుడు పైనుంచి కురిసే అమృతధార మనపైనుంచి కూడా ధారగా కురుస్తుందని అర్థం. అందుకే లింగోద్భవ సమయం అత్యంత పుణ్య ఫలం అని చెబుతారు పండితులు.

లింగోద్భవ సమయంలో అభిషేకం, అర్చనలు చేయలేకపోయినా శివనామస్మరణ చేసినా చాలు…

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

Related posts

Share via