February 24, 2025
SGSTV NEWS
TrendingViral

వీకెండ్‌లో ఆత్మల కోసం వేట.. దడ పుట్టిస్తున్న ‘డార్క్ టూరిజం’ కల్చర్

ఒకప్పుడు టూర్‌కి వెళ్లడం అంటే స్నేహితులు, ఫ్యామిలీ గ్యాంగ్ తో కలిసి ఆహ్లాదం కలిగించే ప్రాంతాలకు వెళ్లొచ్చేవారు. కొందరు ఇందుకోసం పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటారు. మరికొందరికి అడ్వెంచర్లంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. కానీ, ట్రెండ్ మారుతోంది. ఇవన్నీ కాదు.. ఇంకేదైనా కొత్తగా కావాలంటోంది యువత. వీరి ఆసక్తులకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టిని మెల్లిగా తనవైపు తిప్పుకుంటోంది డార్క్ టూరిజం కాన్సెప్ట్. కొందరు థ్రిల్లింగ్ అనుభూతి కోసం మరికొందరు తమ భయాలను అధిగమించడం కోసం వీటిని ఎంచుకుంటున్నారు.


డార్క్ టూరిజాన్నే పారానార్మల్ టూరిజం అని కూడా పిలుస్తున్నారు. ఈ టూర్ ఎలా ఉంటుందంటే ఆ ప్రదేశాల పేరు చెప్తేనే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తలుచుకుంటేనే గుండెదడ మొదలవుతోంది. మామూలుగా అటువైపు వెళ్లడానికి కూడా సాధారణ ప్రజలు జంకుతుంటారు. కొందరు ఔత్సాహికులు మాత్రం ట్రిప్పులకు వెళ్లడానికి ఇవే సరైన ప్రదేశాలంటున్నారు. వీరి పుణ్యమా అని ఒకప్పుడు దెయ్యాల కొట్టాలుగా పేరున్న భవంతులు, ప్రదేశాలన్నీ ఇప్పుడు టూరింగ్ స్పాట్లుగా మారిపోతున్నాయి.

పారానార్మల్ టూరిజం అంటే..
పేరులో ఉన్నట్టుగానే దెయ్యాలు, ఆత్మలను అన్వేషించుకుంటూ వెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎప్పటినుంచో అక్కడ ఆత్మలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంటుంది. లేదా మరేదైనా మిస్టీరియస్ ప్లేస్ అయ్యుంటుంది. అలాంటి ప్రాంతాలను వెతికి మరీ ఒక గ్రూపుగా కలిసి వెళ్లి వస్తుంటారు. ఇది వీరికి థ్రిల్లింగ్ కలిగించేలా ఉంటుందట. ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాంతాలున్నాయో ముందే తెలుసుకుంటారు. ఇక అక్కడకు వెళ్లి వెన్నులో వణుకు పుట్టేలా భయపడిపోతుంటారు. మరికొందరు ఆత్మలున్నాయా లేదా అనే విషయంపై తమ కుతూహలం తీర్చుకుంటారు. వీటిని సైంటిఫిక్ విధానంలో అర్థం చేసుకోవడానికి కూడా ఈ కల్చర్ ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు.

పెరుగుతున్న ఆదరణ..
సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు మీకు దర్శనమిస్తూనే ఉంటాయి. వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఇక ఇప్పటికే ఈ డార్క్ టూరిజం కల్చర్ అమెరికా, కెనడా వంటి దేశాల్లో పాపులర్ గా మారింది. ఇలాంటి దెయ్యాల వేట కోసం అక్కడ ప్రత్యేకించి కొన్ని టూరింగ్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా వెళ్తే వీరంతా బస చేయడానికి ఆ హాంటెడ్ ప్లేస్ లోనే వీరికి నైట్ స్టే, భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

పాడుబడ్డ కోటలే టార్గెట్..
యూకేలో చిల్లింగమ్ క్యాసిల్ అనే ప్రాంతంలో ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా పారానార్మల్ యాక్టివిటీలు జరుగుతాయనే ప్రచారం ఉంది. బ్రిటన్ లోనే ఇది అత్యంత భయానకమైన కోటగా పేరుంది. దీంతో ఊరి చివర దూరంగా విసిరేసిన్టుటండే ఈ ప్రాంతంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. 2016లో జరిపిన ఓ సర్వే ప్రకారం 38 శాతం మంది ప్రజలు తమ సెలవుదినాల్లో ఈ దెయ్యాల వేట కోసమే వెళ్తున్నారట. 44 శాతం మంది ప్రజలు ఈ హాంటెడ్ స్పాట్ కోసమే టూర్ ప్లాన్ చేసుకుంటున్నారట.

భారత్ లోనూ ఈ ప్రాంతాలున్నాయి..
భారతీయులు ఎక్కువగా ఎంచుకునే టూరింగ్ డెస్టినేషన్స్ లో గోవా ఉండనే ఉంటుంది. రొటీన్ గా పారా గ్లైండింగ్, బంగీ జంపింగ్ లాంటివి కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునేవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు భారతదేశంలోని చాలా మంది పారానార్మల్ థ్రిల్ కోరుకునే వారి జాబితాలో రాజస్థాన్‌లోని భాన్‌గర్ కోట , కుల్ధారా గ్రామం లేదా కుర్సియాంగ్‌లోని డౌ హిల్ ఉన్నాయి, ఈ ప్రదేశాల చుట్టూ సంవత్సరాలుగా అల్లిన భయానక కథలు వీరిని ఇక్కడికి రప్పిస్తున్నాయి

Also read

Related posts

Share via