March 13, 2025
SGSTV NEWS
HealthLifestyle

Sadabahar Flower: ఇదేదో పిచ్చిమొక్క అనుకుంటే మీకే నష్టం… ఈ పూలతో 100 రోగాలకు చెక్ ?




సదాబహార్..చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పూలు దాదాపు అందరికీ పరిచయమే..సాధారణంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ పూల మొక్కలు విరివిగా కనిపిస్తుంటాయి. గులాబీ, తెలుపు రంగులో ఉండే వీటిని అందరూ పనికిరాని పిచ్చి పూలుగానే భావిస్తారు. కానీ,పనికి రావని కొట్టేపారేసే ఈ పూల ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే..అవును మీరు చదివింది నిజమే.. సదాబాహార్‌ పూలతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

సదాబహార్ ఇది చాలా శక్తి వంతమైన ఔషధ మొక్క.. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడానికి ఈ పువ్వులు, ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ఈ మొక్క క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది.

అంతేకాదు మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఇది మంచి మెడిసిన్. బీపీ సమస్యలకు సైతం దీని ఆకులు మెడిసిన్ లా ఉపయోగిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం రెండు నుంచి మూడు ఈ ఆకులను నమలడం వల్ల బీపీ, షుగర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు లుకేమియా మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వంటి పరిస్థితులను మెరుగుపరచడానికి ఇది మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు.

అలాగే, కేశ సౌందర్యంలో సదా బహార్‌ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పూలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పూల రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు అప్లై చేసినట్లయితే జుట్టు ఒత్తుగా తయారవుతుంది. అలాగే, జుట్టు రాలే సమస్యలను నిరోధిస్తుంది.

Also read

Related posts

Share via