తెలంగాణ : రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దారుణం జరిగింది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు హత్య చేసి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం .. సులేమాన్ నగర్‌లోని తన సొంత కార్యాలయంలో ఖదీర్ పనిలో నిమగ్నమై ఉండగా, హఠాత్తుగా చొరబడ్డ దుండగులు ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరంపై పలుచోట్ల తీవ్రమైన గాయాలు కావడంతో ఖదీర్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించారు. దాడి చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో భాగంగా, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి బావమరుదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం అందుతోంది. పోలీసులు ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- హైదరాబాద్ హైవే.. నవ జంట బతుకులో కల్లోలం
- పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
- ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి అమానుషం..!
- గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!
- బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం





