April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!


మస్తాన్‌ సాయి, లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నర్సింగీ డీఐ శ్రీనివాస్‌తో లావణ్య రాసలీలు చేసిన ఓ వీడియో బయటపడటంతో ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వీరిద్దరి ఆడియో, వీడియో కాల్స్‌ గుర్తించిన సైబరాబాద్‌ సీపీ.. శ్రీనివాస్‌పై చర్యలకు ఆదేశించారు

Lavanya case: మస్తాన్‌ సాయి, లావణ్య కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నర్సింగీ డీఐ శ్రీనివాస్‌తో లావణ్య రాసలీలు చేసిన ఓ వీడియో బయటపడటంతో ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వీరిద్దరి మధ్య ఆడియో, వీడియో కాల్స్‌ గుర్తించిన సైబరాబాద్‌ సీపీ.. శ్రీనివాస్‌పై  చర్యలకు ఆదేశించారు.


తరచుగా ఫోన్‌ కాల్స్‌..
ఈ మేరకు డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు సీపీ. లావణ్య, డీఐ శ్రీనివాస్‌ మధ్య తరచుగా ఫోన్‌ కాల్స్‌ నడిచినట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరి వ్యవహారం వైరల్ కావడంతో శ్రీనివాస్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసినప్పటీ నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసినట్లు గుర్తించారు

ఇక లావణ్య మాట్లాడిన వీడియో కాల్ లో రొమాంటిక్ పదాలతో పోలీస్ బాస్ ను మాయ చేసేందుకు ట్రై చేసింది. అతను కూడా వయ్యారంగా మాట్లాడుతూ లావణ్యను తెగ పొగిడేశాడు. కలవాలని ఉందంటూ స్వయంగా తాను పోలీస్ స్టేషన్ వస్తానని లావణ్య చెబుతుంటే వద్దని శ్రీనివాస్ ప్రేమగా చెప్పడం సంచలనం రేపుతోంది. అంతేకాదు తాను పిల్లిని పెంచుకున్నట్లే తనను రహస్యంగా ఉంచుకుంటానని లావణ్య చెబుతుంటే పోలీస్ ఆఫీసర్ సిగ్గుపడటం విశేషం. కాగా ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.



ఇదిలా ఉంటే.. మస్తాన్ సాయికి రాజేంద్రనగర్‌ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణలో భాగంగా ఈ నెల 13 నుంచి 15 వరకు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. లావణ్య కేసులో నార్సింగి పోలీసులు మస్తాన్ నుంచి కీలక విషయాలు రాబట్టనున్నారు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌లోని వీడియోలతోపాటు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ(Drugs Party)పై పోలీసుల దర్యాప్తు చేపట్టనున్నారు. అమ్మాయిల ప్రైవేటు వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో క్రిమినల్ సాయిని కస్టడీలోకి తీసుకోనున్నారు. అయితే 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్‌ పోలీసులు కోరగా 2 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిచ్చింది. ప్రస్తుతం జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మస్తాన్‌ సాయిని  ఫిబ్రవరి 13న పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీటితోపాటు మస్తాన్‌పై నార్సింగ్‌, మోకిలా పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి.



Also read

Related posts

Share via