December 3, 2024
SGSTV NEWS
CrimeNational

అర్థరాత్రి బాయ్ ఫ్రెండ్‌తో బయటకి వచ్చింది! కలలు అన్నీ నాశనం!

అశ్వినీ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎన్నో కలలు కనింది. కెరీర్ గురించి ఎన్నో అనుకుంది. తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనుకుంది. కానీ ఆ కలలను కల్లలు చేశాడు ఓ మైనర్

డబ్బున్నోళ్ల ఇళ్లల్లో పిల్లలు కోరిందల్లా ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. పార్టీలు, పబ్‌లు అంటూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. చదువులు పక్కన పెట్టి.. బైక్స్, కార్లు వేసుకుని రోడ్డుపై రయ్ మంటూ దూసుకెళుతున్నాఅడ్డు చెప్పట్లేదు పేరెంట్స్. ఇందులో మైనర్లు కూడా ఉన్నారు. పిల్లలు ఎక్కడకు వెళుతున్నారో కూడా తల్లిదండ్రులు అడగకపోవడంతో వీరికి మరింత రెక్కలిచ్చినట్లయ్యింది.  ఇలాంటి వాళ్లు ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఓ రియల్టర్ మైనర్ కుమారుడు.. పోర్సే కారుతో ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. నిందితుడికి 15 గంటల్లో బెయిల్ దొరకడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. పూణెలో ఐటి ఇంజనీర్లుగా వర్క్ చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్ అవధియా, జబల్‌పూర్‌ వాసి అయిన అశ్విని కోష్ట శనివారం ఓ గెట్ టు గెదర్ పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరిద్దరు బైక్ పై వస్తుండగా.. ఆదివారం తెల్లవారు జామున 2.15 నిమిషాలకు ఓ పోర్షే కారు.. వారి బైక్‌ను బలంగా ఢీ కొట్టడంతో వీరిద్దరు అక్కడిక్కడే మరణించారు. కారు వేగంగా ఢీ కొట్టడంతో 20 మీటర్ల గాల్లోకి ఎగిర కింద పడిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే కారు ఢీ కొట్టగానే.. ఆగిపోయింది. స్థానికులు ఒకరిని పట్టుకోగా.. ఒకరు పారిపోయాడు. పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపట్టగా.. ఓ మైనర్ బాలుడు వేదాంత్ అగర్వాల్  కారు నడుపుతున్నాడని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, మైనర్.. ఇటీవలే 12వ తరగతి పరీక్షలు రాయగా.. పాస్ కావడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత కూడా లేని ఆ కుర్రాడు మద్యం సేవించి.. పబ్ నుండి తన స్నేహితులతో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మైనర్ బాలుడ్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కాగా, అతడికి 15 గంటల్లో బెయిల్ వచ్చేసింది.  15 రోజుల పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు హెల్ప్ చేయాలని, ప్రమాదాలపై 300 పదాల వ్యాసాన్ని రాయాలని, మద్యం అలవాటు మానేందుకు కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలంటూ కండీషన్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తప్పతాగి.. ఇద్దరి ప్రాణాలకు కారణమైన నేరస్థుడికి బెయిల్ మంజూరు కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

రియల్టర్ కొడుకు కావడంతోనే త్వరగా బెయిల్ వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. సమయానికి మించి పబ్ నడుపుతున్న వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడికి కారు అందించినందుకు తండ్రిపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా, అనీష్ అవధియా, అశ్వినీ కుటుంబ సభ్యులు.. వారి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, నిందితులకు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. అశ్వినీ ఎన్నో కలలు కందని, కెరీర్‌లో రాణించాలని, తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని కోరుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Also read

Related posts

Share via