February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్



జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేడు గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ పై ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై ప్రెస్ క్లబ్ కి వెళ్లగా ఆ సమీపంలో లక్ష్మిని అరెస్టు చేశారు.


Kiran Royal Issue:  తిరుపతి జనసేన పార్టీ(Janasena Party) ఇంఛార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని.. లక్ష్మి(Lakshmi) అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన వద్ద రూ.1.20 కోట్లు తీసుకున్నాడని.. తిరిగి అడిగితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలుపుతూ ఆమె ఓ వీడియో ఇటీవల రిలీజ్ చేసింది.


అనంతరం కిరణ్ రాయల్ స్పందిస్తూ.. ఆమె ఒక క్రిమినల్ అని.. ఆమెపై మూడు రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయని అతడు కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. దీనిపై జనసేన పార్టీ హైకమాండ్ స్పందిస్తూ.. ఈ విషయం తేలేవరకు పార్టీకి దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ ను ఆదేశించింది.





లక్ష్మి అరెస్ట్
ఈ క్రమంలోనే రాజస్థాన్ పోలీసులు లక్ష్మిని అరెస్టు చేశారు. గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన అనంతరం లక్ష్మి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇంతలో రాజస్థాన్ పోలీసులు అకస్మాత్తుగా వచ్చి లక్ష్మిని ప్రెస్ క్లబ్ సమీపంలో అరెస్టు చేసి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఇప్పుడిదే అంశం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.


లక్ష్మి ఫిర్యాదులో ఆరోపణలు
ఇక కిరణ్ రాయల్ వ్యవహారంలో బాధితురాలు లక్ష్మి ఎస్పీని కలిసి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసి.. మొత్తం ఆధారాలను అందజేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదులో.. డబ్బులు ఉన్నంత వరకు కిరణ్ రాయల్ తనను వాడుకున్నాడని ఆరోపించినట్లు తెలుస్తోంది. తనను కిలాడి లేడీ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.



తనపై నిందలు వేస్తున్నాడని.. తనను ఎంతో అవమానించాడని తెలిపినట్లు సమాచారం. తన వెనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారంటూ చాలా భయపెట్టాడని చెప్పినట్లు తెలిసింది. అంతేకాకుండా కిరణ్ రాయల్ కి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తనకు న్యాయం చేయాలని.. తనకు ఇవ్వాల్సిన కోటి 20 లక్షలు రూపాయలు ఇప్పించండని ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.

Also read

Related posts

Share via