April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం


తిరుపతి జిల్లాలో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన ఓ ల్యాబ్ టెక్నీషియన్ పేషెంట్ బంగారు గాజులను దొంగిలించాడు. ప్రమిల అనే మహిళకు గాయలు అయ్యాయి. ఆమెకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెల్లడంతో 6సవర్ల గాజులు పట్టుకుని పారిపోయాడు.




శత్రువులు ఎక్కడో ఉండర్రా.. మన పక్కనే.. మనతోనే ఉంటారు అనే ఈ డైలాగే అందరూ వినే ఉంటారు. కొన్నిసార్లు అదే నిజమనిపిస్తుంది. మనం నమ్మిన వారే మనల్ని నట్టెట ముంచేసే పరిస్థితులు కొందరికి ఎదురవుతాయి. కొన్ని సినిమాల్లోనూ అలాంటి సన్నివేశాల్ని చూపిస్తారు. అలాంటివి రియల్ లైఫ్‌లోనూ జరుగుతాయి.

తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. తెలిసిన వ్యక్తే కదా అని వారానికోసారి ఇంట్లోకి రానిస్తే.. అతడు చేసిన పనికి అంతా షాకయ్యారు. ఏకంగా మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. అతడు చేసిన దారుణం బయటకు రావడంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?.. మహిళ ఇంటికి ఎందుకు వచ్చాడు?.. వారానికి రావలసిన అవసరం ఏమొచ్చింది?.. వచ్చి అతడు చేసిన దారుణం ఏంటి?.. అనే విషయానికొస్తే..

మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా కోటలోని స్థానిక NCR నగర్‌లో ప్రమీల అనే మహిళ నివాసముంటుంది. ఆమెకు ఒక కుమారుడు. ఇద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు మధుమేహ సమస్య ఉంది. అయితే ఇటీవల ప్రమీలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లోని ల్యాబ్‌లో పనిచేస్తున్న సంపత్ అనే వ్యక్తి వారాని ఒకసారి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేసి వెళ్లిపోయేవాడు.

ఇదే క్రమంలో ఈ నెల అంటే ఏప్రిల్ 10న గాయాలతో ఉన్న ప్రమీలకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చాడు. ఇందులో భాగంగానే ఆమెకు పెయిన్స్ తగ్గేందుకు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. వెంటనే ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. దీంతో సంపత్ ఆమె చేతికి ఉన్న ఆరు సవర్ల గాజులను తీసుకుని పారిపోయాడు. అనంతరం మెలుకువలోకి వచ్చిన ప్రమీల తన చేతులను చూసుకోగా.. బంగారు గాజులు కనిపించలేదు. దీంతో తన ఇంటికి వచ్చిన సంపతే దొంగిలించి ఉంటాడని.. అతడిని నిలదీసింది. అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాధితురాలు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also read

Related posts

Share via