Kurnool district News: కొడుకుల పెళ్లి గోల, ఆ తండ్రికి పెద్ద చిక్కులే తెచ్చింది. వివాహం చేయలేదని ఏకంగా ఆ ఇద్దరు కుమారులు కలిసి, తండ్రినే చితకబాదారు. ఇదేంటయ్యా అంటే.. మాకు పెళ్లిళ్లు చేయాలిగా అంటూ వారు వాదించడం కొసమెరుపు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
నేటి రోజుల్లో వివాహాలు జరగాలంటే పెద్ద తతంగమే సాగుతోంది. ప్రేమ పెళ్లిళ్ల గురించి అయితే అంతగా ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు. ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయా.. పెద్దలను ఒప్పించారా.. లేకుంటే నేరుగా దండలు మార్చుకున్నారా.. ఆ తర్వాత వివాదాలు సాగితే అలా.. లేకుంటే బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు ప్రేమ జంటలు. కానీ పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు నిశ్చయం కావాలంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తున్నారు.
పెళ్లి అనే బంధం నిండు నూరేళ్ల బంధం కదా అంతమాత్రం ఉండాలి అంటారు పెద్దలు. ఉద్యోగాలు ఉండాలి.. ఆస్తి ఉండాలి.. ఆదాయం అంతకు మించి ఉండాలి.. ఇది నేటి వివాహాలకు అసలు పునాది. చాలా మంది యువకులు వయస్సు పైబడినా కూడా పెళ్లి జరగక అలాగే ఉంటున్న పరిస్థితి. అయితే పెళ్లి జరగలేదన్న ఆవేదన, చివరికి కొంతమంది తమ తల్లిదండ్రులపై చూపుతున్నారు. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది.
కర్నూలు జిల్లా గోనెంగండ్ల మండలంలో తమకు తండ్రి వివాహం చేయడం లేదంటూ.. ఇద్దరు కుమారులు కలిసి ఏకంగా చితకబాదారు. కిరాణా షాప్ నిర్వహిస్తున్న మంత రాజుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇటీవల పెద్ద కుమార్తెకు వివాహం జరిపించిన మంతరాజుకు ఇద్దరు కుమారులు ఇక తమకు వివాహం జరిపించాలని పలుమార్లు కోరారు. 40 ఏళ్లు దాటినా వివాహం కాకపోవడంతో, ఇద్దరు కుమారులు తమ తండ్రిపై అక్కసు పెంచుకున్నారు.
కర్నూలు జిల్లా గోనెంగండ్ల మండలంలో తమకు తండ్రి వివాహం చేయడం లేదంటూ.. ఇద్దరు కుమారులు కలిసి ఏకంగా చితకబాదారు. కిరాణా షాప్ నిర్వహిస్తున్న మంత రాజుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇటీవల పెద్ద కుమార్తెకు వివాహం జరిపించిన మంతరాజుకు ఇద్దరు కుమారులు ఇక తమకు వివాహం జరిపించాలని పలుమార్లు కోరారు. 40 ఏళ్లు దాటినా వివాహం కాకపోవడంతో, ఇద్దరు కుమారులు తమ తండ్రిపై అక్కసు పెంచుకున్నారు.
ఒంటరిగా తండ్రి ఉన్న సమయంలో బంధించి ఇద్దరు కుమారులు.. తమకు వివాహం జరిపించాలని విచక్షణారహితంగా కర్రలతో కుట్టి దాడి చేయడం విశేషం. తండ్రి మంతరాజు కేకలు విన్న స్థానికులు, వెంటనే ఇంటి వద్దకు చేరి వారి బారి నుండి రక్షించి స్థానిక వైద్యశాలకు తరలించారు. ఇదేమి చిత్రమో.. వివాహం జరిపించాలని తండ్రిని చితక బాదడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మొన్నటి వరకు ఓకే.. ఇప్పుడు వివాహం జరిపించాలని ఏకంగా తండ్రిని దాడి చేసిన వారికి.. పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతాయంటూ మరో వాదన కూడా వినిపిస్తున్నారు స్థానికులు. ఎట్టకేలకు కుమారులు చేతిలో తీవ్రంగా గాయపడ్డ మంతరాజు.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025