* ఏసీబీకి చిక్కిన ఎంఈవో
* రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా కూడేరు ఎంఈవో చంద్రశేఖర్
Bribe: ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. కూడేరు ఎంఈవో చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా పట్టుబడ్డాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి బైపాస్ రోడ్లో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎంఈఓ పట్టుబడ్డాడు. కూడేరు ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొట్కూరు సమీపంలో ఉన్న వెరీ డైన్ ఎ కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పై స్టూడెంట్ యూనియన్స్, మీడియాలో వస్తున్న వాటిపై డీఈవో దృష్టికి వెళ్లకుండా మేనేజ్ చేయడానికి స్కూల్ యాజమాన్యం నుంచి 2 లక్షల రూపాయలను ఎంఈవో డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్లోని ఎంజీ పెట్రోల్ బంకు వద్ద ఎంఈవో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025