కాపులంటే ఎందుకు ఇంత కక్షండి అంటూ ప్రశ్నించిన కాపు యువత*
కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారూ.. ఆలమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపానికి ఇస్తామన్న నిధులు ఏమయ్యాయో చెప్పాలండి అంటూ కాపు యువకులు ప్రశ్నించారు.మంగళవారం వారు ఆలమూరు కాపు కళ్యాణమండపం వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ కళ్యాణ మండపానికి కోటిన్నర రూపాయలు విలువైన 40 సెంట్లు స్థలాన్ని,రూ. 50 లక్షల నిధులు కాపు కార్పొరేషన్ నుంచి మంజూరు చేశారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక దాతల విరాళాలతోనే కొంత నిర్మాణాలు జరిగాయి అన్నారు. అయితే ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ సందర్భంగా రూ.15 లక్షలు మంజూరు చేశానని ఉత్తుత్తి శాంక్షన్ కాగితాలు ఇచ్చారని దాంతో మా కాపు సంఘం నాయకులు గజమాలతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కి ఆనందోత్సాహాలతో సత్కారం చేసారన్నారు.అయితే ఇప్పటివరకు ఆ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. కాపు కళ్యాణ మండపం నిధుల కేటాయింపులో ఎందుకంత వివక్ష చూపుతున్నారని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిధులు ఇచ్చారని ఆలమూరు మండల కాపు సంఘం అధ్యక్షులు చల్లా ప్రభాకరరావు చెప్పడంతో నిజమే అనుకుని ఆనందపడ్డామని కానీ ఇప్పటివరకు ఆ నిధులు విడుదల చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలమూరు కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి కాపు కార్పొరేషన్ ద్వారా రూ. 50 లక్షల నిధులు స్థలము మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కు స్వాగతం చెబుతూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి స్థానిక కొంతమంది కాపు నాయకులను మభ్యపెట్టి తొలగించి ఆయనను ప్రారంభోత్సవానికి రాకుండా అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్పందించి ఆలమూరు కాపు కళ్యాణ మండపం నిర్మాణాలకు ఎందుకు నిధులు ఇవ్వకుండా వివక్షత చూపారో వివరణ ఇచ్చి ఎన్నికలలో ఓట్లు అడగాలని వారు డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో కాపు నాయకులు రామానుజులు శేషగిరిరావు, మానేపల్లి శ్రీనివాస్,పురుషోత్తం వీర్రాజు ,వెంపలు సత్యనారాయణ, తమ్మి రెడ్డి సాయిబాబా, చల్లా సత్యనారాయణ, చల్లా వెంకటేశ్వరరావు, ఇండుగుల శ్రీనివాస్, కొప్పినీడి శ్రీనివాస్, పసుపులేటి సూరిబాబు, చల్లా ఉదయ్ భాస్కర్, కొమ్మి శెట్టి మా లక్ష్మి, వెంపల శ్రీనివాస్, వానపల్లి నాగేంద్ర గోపిశెట్టి వీరబాబు దామోదర ఉదయ్ కుమార్ సిరిగినేడి పట్టాభి, సత్తి విశ్వేశ్వరరావు ధన భాస్కర్, కొండేటి సత్యనారాయణ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం