SGSTV NEWS
Andhra PradeshCrime

Occult Worship: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..


కోనసీమ జిల్లా కొత్తపేటలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఓ ఇంటి యజమాని పూజ కోసం 30 అడుగుల లోతైన గొయ్యిని తవ్వి, మ్మకాయలు, పసుపు, కుంకుమతో కూడిన పూజా సామగ్రిని గమనించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

AP Crime: కోనసీమ జిల్లా కొత్తపేటలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. ఈ ఘటన గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఓ ఇంటిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆ ఇంటి యజమాని రాత్రి ఓ రహస్య పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ కోసం ఇంటి మధ్యలో సుమారు 30 అడుగుల లోతైన గొయ్యిని తవ్వించాడు. దీనిని చూసి ఆశ్చర్యానికి గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా ఇంటి పరిసరాల్లో  నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో కూడిన పూజా సామగ్రిని గమనించారు. పక్కా ప్రణాళికతో.. రాత్రి కార్యక్రమం జరిగిందని చెబుతున్నారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు..
ఈ విషయం తెలిసిన వెంటనే కొత్తపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఇంటి యజమానిని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అమలాపురానికి చెందిన ఓ వ్యక్తిని పూజల నిర్వహించినట్లు గుర్తించారు. అతడిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

ఇటువంటి ఘటన గతంలో కూడా నమోదయ్యాయి. అయితే జనవాసాల మధ్యలో ఇలా బహిరంగంగా, పక్కా ప్రణాళికతో తవ్వకాలు చేయడం కొత్తపేట వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రజల భద్రతకు రక్షణ లేకుండా మారే ఈ తరహా కార్యకలాపాలను ఆపాలని ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సంఘటన వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే దిశగా దర్యాప్తును చేస్తున్నారు.

Also read

Related posts

Share this