SGSTV NEWS
Andhra PradeshCrime

కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు


అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది.

మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్ బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Also read

Related posts