అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తేల్చారు.
ఉపాధి కోసం భర్త గల్ఫ్ దేశంలో ఉంటుండగా ఇక్కడ ఉన్న ఇల్లాలు పక్కింటి యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగక ఆ యువకున్ని పక్కన పెట్టి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో తనను పట్టించుకోవడం మానేసిందన్న కోపంతో ఇంట్లో కాపుకాచి కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపాడు మొదటి లవర్. ఈ ఘటనలో వెలుగు చూసిన అక్రమ సంబంధం కోణం విస్తుపోయేలా చేసింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలో వివాహిత దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధమే కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. రెల్లుగడ్డ ప్రాంతానికి చెందిన బంతు మణికుమారి భర్త గత కొంత కాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఇంటి సమీపంలోనే ఉన్న కొంబత్తుల నవీన్‌కుమార్ అనే యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుందా మహిళ. కొన్ని నెలల క్రితం విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అక్రమ సంబంధంపై భర్త, కుటుంబికుల వరకు చేరి పంచాయతీ జరిగింది.
ఎవరి దారి వాళ్లు చూసుకుంటామని కూడా మాట ఇచ్చారట. కానీ ఏ మాత్రం మార్పులేని మణికుమారి నవీన్‌కుమార్‌తోనే సంబంధం కొనసాగించింది. కొన్నాళ్ల నుంచి నవీన్‌కుమార్‌ను మెల్లగా పక్కన పెట్టింది. పొడిపొడిగా మాటలాడుతుండడంతో అనుమానం వచ్చిన నవీన్‌కుమార్ ఆమె కదలికలపై ఆరాతీశాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని గ్రహించాడు. దీనికి తోడు మరో వారం రోజుల్లో భర్త వద్దకు వెళ్లిపోయేందుకు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అగ్రహావేశాలకు లోనైన నవీన్‌కుమార్ మణికుమారి హత్యకు ప్లాన్ చేశాడు.
బాత్‌రూమ్‌లో కాపుకాచి..
తనతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మిన నవీన్‌కుమార్ ఉదయం 9 గంటలకే హతురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. వెళ్లి బాత్‌రూమ్‌లో నక్కి హతురాలి ఫోన్ సంభాషణలు విన్నాడు. ఆపై ఆ ఇంట్లో ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. అప్పటికి మణికుమారి కిచెన్‌లో వంట చేస్తూ ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దెబ్బలకు మణికుమారి అక్కడికక్కడే మృతి చెందింది.
అక్కడ జరిగిన పెనుగులాట తెలుసుకున్న తోడికోడలు కుమారుడు వచ్చి చూడగా మణికుమారి రక్తపు మడుగులో పడి ఉంది. భయంతో వారంతా కేకలు పెట్టారు. చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు. హత్యకు పాల్పడ్డ నిందితుడు నవీన్‌కుమార్ పరారీలోనే ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరీష్‌కుమార్ తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం