October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Kodikatthi case – నిందితుడి బెయిల్‌ రద్దుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ : కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎపి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. నిందితుడిని అరెస్ట్‌ చేసింది. సుమారు ఐదేళ్లు జైల్లో ఉన్న శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిల్‌ రద్దుకు నిరాకరించింది.

Also read :వైసీపీ నేత డాబా హౌస్ కూల్చివేత

Vijaysai Reddy: మదన్‌ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది! కానీ ఆ టార్చర్ భరించలేక…

Related posts

Share via