కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని తమ కోడలిని అత్తమామలే హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ మర్డర్‌ను కట్టుకున్న భర్తే ప్లాన్ చేయడం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని తమ కోడలిని అత్తమామలే హత్య చేయడం సంచలనంగా మారింది. అందులోనూ ఈ మర్డర్‌ను కట్టుకున్న భర్తే ప్లాన్ చేయడం మరింత హాట్ టాపిక్ అయింది. హత్య చేసిన తర్వాత దానిని రోడ్ యాక్సిడెంట్‌గా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పిల్లలు పుట్టడం లేదని చంపేశారు
మహారాష్ట్రలోని సతారాలో సంతోష్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి విజయపుర జిల్లాలోని చడచన్‌కు చెందిన రేణుకతో 2020లో వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు ఆర్థికంగా స్థిరమైనవి. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నుంచే వివిదాలు, సమస్యలు మొదలయ్యాయి. దీంతో భార్య భర్తలు కొన్ని ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. రేణుక ఆరోగ్య సమస్యలు, గర్భం దాల్చకపోవడంతో ఇరు ఫ్యామిలీల మధ్య వివాదాలు మరింత రేగాయి
దీంతో రేణుకను హత్య చేసేందుకు అత్తమామలు జయశ్రీ, కామన్న, కొడుకు సంతోష్ ప్లాన్ వేశారు. దాని ప్రకారమే.. మే 18న అత్త జయశ్రీ, మామ కామన్న కోడలు రేణుకను రాత్రిపూట గుడికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న సమయంలో అత్త జయశ్రీ.. రేణుకను కిందికి తోసేసింది. ఆపై పక్కనే ఉన్న రాళ్లతో దాడి చేసింది. మామ కామన్న సైతం రేణుక గొంతు నులిమి చంపేశాడు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించాలని.. బైక్ టైర్లో రేణుక చీరను పెట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లారు.
అయితే ఈ ఘటన పోలీసుల వరకు వెళ్లడంతో వారు తమదైన శైలిలో విచారించారు. కేవలం రేణుకకు మాత్రమే గాయాలు ఉండటం.. మిగిలిన ఇద్దరికి గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చి విచారించారు. ఈ విచారణలో అత్తా మామ హత్య చేసినట్లు అంగీకరించారు. అలాగే తమ కుమారుడు సంతోష్.. రేణుకను చంపడానికి తమను ప్రేరేపించాడని తెలిపారు. దీంతో ముగ్గురుని హిండల్గా జైల్లో వేశారు
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రేణుకతో విడిగా ఉన్నపుడే సంతోష్ మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య గర్భం దాల్చడంతో హత్యకు చివరి కారణం కావచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రేణుకకు పిల్లలు లేకపోవడం కారణాల వల్ల చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని పోలీసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి