ఆమెకు 16.. అతనికి 17..తెలిసీ తెలియని వయసు. కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగానే ఆ బాలికకు తల్లిదండ్రులు ఇటీవల మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. అయితే ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు
KMM SUICIDE : ఆమెకు 16.. అతనికి 17..తెలిసీ తెలియని వయసు. కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగానే ఆ బాలికకు తల్లిదండ్రులు ఇటీవల మరోక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. అయితే ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా సారథినగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని సారథినగర్ జూబ్లీపురకు చెందిన సాయితేజ(17) కొంతకాలంగా స్థానికంగా ఉండే బాలిక (16)తో ప్రేమలో ఉన్నాడు. అయితే వీరి ప్రేమను అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు 16 ఏళ్లకే ఆ బాలికకు వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. ప్రేయసి దక్కలేదన్న బాధతో మనస్థాపానికి గురయిన సాయితేజ ప్రేయసి ఎంగేజ్‌మెంట్‌ను తట్టుకోలేక అఘాయిత్యానికి ఒడి గట్టాడు. ప్రేయసి దక్కలేదన్న బాధతో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సాయితేజ మృతితో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





