SGSTV NEWS online
CrimeTelangana

TG news: సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శిశువు అపహరణ…


సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.

సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించిన ఘటన కలకలం రేపింది. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణి నాలుగో కాన్పు కోసం గత రాత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా మహి ఆడశిశువుకు జన్మినిచ్చింది. కొంతసేపటికే ఆ శిశువు కనిపించకుండా పోయింది. బాధిత మహిళ, ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ప్రసవ సమయంలో ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. వారే శిశువును ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు  అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts