వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి
వరంగల్ (Warangal) లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ (Kidnap) చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి. హనుమకొండ జిల్లాలోని దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈ కిలాడీ లేడీ మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది.
డ్రగ్స్‌కు అలవాటు పడి
డ్రగ్స్ కు బానిసైన ఈ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన కొంతమంది యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. స్కూల్ కు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తుంది. వరంగల్ లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది. స్కూల్ కు వెళ్లివచ్చే టైమ్ లో బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. ఆ తరువాత చనువు పెంచుకుని, కలివిడిగా ఉన్నట్టు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన, తన గ్యాంగ్ కు టచ్లో ఉన్న మానవ మృగాలకు అప్పగిస్తోంది
బాలికలు మత్తులో ఉండగా
కిలాడీ లేడీకి డబ్బు ఇచ్చే ఆ మానవ మృగాలు.. బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోయేది. ఇలా ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది.
కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు తెలిశాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా