SGSTV NEWS online
CrimeTelangana

ఖమ్మం నగరంలో మహిళ దారుణ హత్య



ఖమ్మం: ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్బాబజార్లోని ఓ మాల్ పక్క సందులో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు సమాచారం అందించగా ఖమ్మం ఒకటో పట్టణ ఎస్సై మౌలానా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

మృతురాలిని భద్రాచలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడి భార్య ప్రమీలగా గుర్తించారు. పిల్లలు పుట్టలేదని కొన్నేళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ప్రమీలను కొద్దినెలలుగా భర్త స్నేహితుడు శ్రావణ్ వేధిస్తున్నాడు. నెల క్రితం.. భద్రాచలంలో అతడిపై ప్రమీల కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. తనకు సహకరించకపోగా కేసు పెట్టినందుకు ఆమెను శ్రావణ్ కత్తితో పొడిచి చంపి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Also read

Related posts