February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Khammam: ఖమ్మంలో కసాయి కోడలు.. మామను ఎలా చంపిందంటే?


సొంత మామనే కోడలు చంపేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. అస్తమానం బయటకు తిరగవద్దని మామ మందలించడంతో కోడలు కక్ష పెంచుకుంది. సమయం చూసి ఓ రోజు నిద్రపోతున్న మామపై వేడి నూనె పోసింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ మధ్య కాలంలో మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. మంచి కోసం చెప్పిన ఇతరులపై కక్ష్య పెట్టుకుని చంపేస్తున్నారు. ఇలా కక్ష పెట్టుకుని సొంత మామనే చంపేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కారేపల్లి మండలంలోని తండాలో అజ్మీరా బాబు నివసిస్తున్నాడు. కరోనా కారణంగా ఇతని కొడుకు మరణించాడు. అప్పటి నుంచి కోడలు ఉమ పిల్లలతో అత్తవారింట్లోనే ఉంటుంది.

సమయం చూసి వేడి నూనె..
కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో బయట ఎక్కువగా తిరగవద్దని అజ్మీరాబాబు కోడలిని మందగించాడు. పలుమార్లు చెప్పడంతో మామపై కోడలు కక్ష పెంచుకుంది. ఓ రోజు మామ నిద్రపోతుండగా.. సలసల కాగిన వేడి నూనెను తీసుకుని ఒంటిపై పోసింది. వేడి నూనెకి ఒళ్లంతా కాలుతున్న కూడా పట్టించుకోలేదు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అజ్మీరాబాబు కన్నుమూశారు.

ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. పొరుగున్న కొందరు వ్యక్తుల నుంచి తమకు వేధింపులు వచ్చాయని.. దాని కారణంగానే చంపేసినట్లుఆ యువకుడు తెలిపాడు. తమ ఇల్లు కబ్జా చేయాలని కొందరు చూశారని.. వారిని అడ్డుకునేందుకు తాను తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని తెలిపాడు. 15 రోజులుగా చలిలో తిరిగామని.. ఫుట్‌పాత్ మీదే నిద్రపోతున్నామని అన్నాడు. తమ ఇంటి పత్రాలు తమవద్దే ఉన్నా.. సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లకు మొదట విషం పెట్టి చంపానని.. ఆ తర్వాత చేతి మణికట్టు నరాలు కోసి.. ఊపిరాడకుండా చేశానని ఆ యువకుడు తెలిపారు.

Also read

Related posts

Share via