కర్ణాటకలో భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. భర్తకు బట్టతల ఉందని, దీంతో బయటకు ఎక్కడికి కలిసి వెళ్లలేకపోతున్నానని మాటలతో అతన్ని అవమానించేంది. ఇవన్నీ భరించలేక ఆ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య వేధింపులు భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చామరాజనగర తాలూకాలోని ఉడిగాలలో పరమశివమూర్తి అనే వ్యక్తికి మమతతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పరమశివమూర్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పెళ్లయిన సమయానికే పరమశిమూర్తికి బట్టతల ఉంది. పెళ్లయిన తర్వాత పూర్తిగా జుట్టు రాలిపోయింది. దీంతో భార్య ఎప్పుడూ హేళన చేసేది. జుట్టు లేదని, నీతో బయటకు రావాలంటే చాలా సిగ్గుగా ఉందని మాటలతో బాధపెట్టేది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య గొడవలయ్యేవి.
భార్య వేధింపులు భరించలేక..
ఈ క్రమంలో భార్య అతనిపై గృహహింస, కట్నం వేధింపుల కేసు కూడా పెట్టింది. కొన్ని రోజులు జైలులో ఉన్న అతను ఇటీవల ఇంటికి వచ్చాడు. ఇంతలో భార్య సోషల్ మీడియాలో సింగిల్ అని పెట్టిన స్టేటస్ చూసి ఇంకా ఆవేదన చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..