ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాలలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వైపు పెద్దపల్లిలో బైక్ ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Karimnagar: పండగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రహదారులు నెత్తుటి మరకలు పూసుకున్నాయి. ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సంక్రాంతి సంబరాలతో సందడిగా కనిపించాల్సిన ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వారి ప్రాణాలను మిగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో అరవింద్, సాయి, వంశీ ముగ్గు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అరవింద్, సాయి అక్కడిక్కడే మృతి చెందగా.. వంశీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. పరిస్థితి విషమించడంతో వంశీ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తమ పిల్లలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
పెద్దపల్లిలో మరో ఘటన..
అదే సమయంలో పెద్దపల్లిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాపూర్ దగ్గర ట్రక్కు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజ్ కుమార్, అభినవ్ అనే ఇద్దరు యువకులు స్పాట్ లోనే మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..