విద్యాబుద్ధులు నేర్పాల్సిన తండ్రి లాంటి ఉపాధ్యాయుడే విద్యార్థినులతో అమానుషంగా ప్రవర్తించాడు. వారు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా ఒక్కసారిగా పాఠశాలకు వచ్చి దేహశుద్ధి చేశారు.
ఆదర్శ పాఠశాల విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన ముగ్గురి సస్పెన్షన్, ఇద్దరి తొలగింపు
కారంపూడి, : విద్యాబుద్ధులు నేర్పాల్సిన తండ్రి లాంటి ఉపాధ్యాయుడే విద్యార్థినులతో అమానుషంగా ప్రవర్తించాడు. వారు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా ఒక్కసారిగా పాఠశాలకు వచ్చి దేహశుద్ధి చేశారు. పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఆంగ్లం బోధించే బి.రవికుమార్ విద్యార్థినులను ల్యాబ్కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులతో అలాగే ప్రవర్తించడంతో పాటు వారికి రాత్రి సమయాల్లో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ తండ్రి గమనించి.. తమ కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు తల్లిదండ్రులు కలిసి గురువారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ప్రిన్సిపల్ నయోమి ఆ ఉపాధ్యాయుడిని రక్షించి, తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

విషయం తెలుసుకున్న ఎంఈఓ రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చి, పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై ఆర్జేడీ, డీఈఓలకు తెలిపారు. అధికారులు విచారిస్తుండగా మరోసారి ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడికి దిగడంతో పోలీసులు అతడిని స్టేషన్కు తరలించారు. ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులు ప్రిన్సిపల్పైనా దాడిచేశారు. ఎస్సై అమీర్ బాధిత విద్యార్థినుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. సాయంత్రం ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓ ఏసుబాబు పాఠశాలకు చేరుకుని విచారణ చేశారు. ఉపాధ్యాయుడు రవికుమార్, ప్రిన్సిపల్ నయోమి, వైస్ ప్రిన్సిపల్ శుభశ్రీలను సస్పెండ్ చేశారు. కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలి, బాలికల వసతిగృహ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..