SGSTV NEWS online
Andhra PradeshCrime

Kakinada News : కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపాడని..కొడుకుకు వాతలు పెట్టిన సైకో


ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు

Kakinada News :  కన్నతండ్రి అంటే తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒకవేళ పిల్లలు తప్పుచేస్తే మాటలతో మందలిస్తారే కానీ, చేయి కూడా చేసుకోరు. కానీ, ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊడిపోయాడు. అంతటితో ఆగకుండా పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచలనంగా మారింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిపాడు మండలం వామ్మంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి  ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ తెలియక ఆటో సీటు కవర్‌ను చింపేశాడు. ఇది చూసిన తండ్రి అలా చేయకూడదని మంచి మాటలు చెప్పాల్సింది పోయి కోపంతో ఊగిపోయాడు. విచక్షణ కోల్పోయి చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఇంట్లో ఉన్న అట్లకాడ, ఇనుప చువ్వను వేడి చేసి బాలుడి ముఖం, కాళ్లు, చేతులు, శరీర భాగాలపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాడు.

ఒళ్లంతా వాతలు తేలిన బాలుడు ఆ మంటను భరించలేక ఏడుస్తూ కేకలు వేశాడు. ఈ కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడి దృశ్యాన్ని చూసి చలించిపోయిన స్థానికులు తండ్రి బారి నుంచి బాలుడిని రక్షించి వెంటనే ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, చిన్నారి పరిస్థితి చూసి అంతా కన్నీరు పెట్టుకున్నారు. తెలిసీ, తెలియక తప్పు చేసిన కన్న కొడుకును ఇంత దారుణంగా చిత్ర హింసలకు గురిచేయడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోయారు.  సైకో తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Also read

Related posts