కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో బెదిరించిన ఘటనపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరోసారి విచారణ చేపట్టారు. హత్య కేసు నిందితులకు కడప జైల్లో సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్తోపాటు, అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యురాలు పుష్పలత, ప్రవీణ్ను ఎస్పీ విచారించారు. రెండు వారాల క్రితం ఓ రోజంతా ఇప్పటికే వీరిని విచారించారు. 2023 నవంబర్లో జైలు అధికారుల అండతో తనను చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యుల బృందంతో కమిటీ వేసింది.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు