July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

భగత్ సింగ్ 93వ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన సభలో జువ్వల రాంబాబు

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు… నింగికెగిసిన విప్లవ ధృవ తార. ఉరితాడే ఊయలగా త్యాగానికి ప్రతీకగా దేశ భక్తికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన షహీద్ భగత్ సింగ్ జీవితం ధన్యం అని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు కొనియాడారు

. ఈరోజు భగత్ సింగ్ 93వ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన సభలో జువ్వల రాంబాబు ఘనంగా నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ భారత జాతీయోద్యమంలో పాల్గొని కేవలం 23ఏళ్ల వయస్సులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్ అని రాంబాబు అన్నారు భగత్ సింగ్ 1907సెప్టెంబర్ 28న ప్రస్తుతం పాకిస్తాన్లో వున్న బంగా అనే గ్రామంలోజన్మించారు. జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన జలియన్వాలా బాగ్ ప్రాంతాన్ని తన 12ఏళ్ల వయస్సులో సందర్శించారు. 19019లోజరిగిన జలియన్ వాలా బాగ్ దమనకాండలో 379మరణించటం 1200మంది క్షతగాత్రులు అవ్వటానికి కారణమైన బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని ఆ రోజే భగత్ సింగ్ బలంగా నిర్ణయించుకున్నారన్నారు దేశం కోసం జరిగిన పోరాటంలో 1931మార్చి 23న భగత్ సింగ్ రాజ్ గురు. సుఖదేవులు ఉరి తీయబడ్డారు ఇప్పుడు వారి త్యాగాలకు భిన్నంగా నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కానీ అది తొడుక్కున్న మతం ముసుగు ఆర్ ఎస్ ఎస్ మూకలు ఏ రోజు స్వాతంత్ర సంగ్రామం లో పాల్గొనలేదు సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ముందు మోకరిల్లిన కళంక దేశ భక్తులు ఇప్పుడు మేమే నిజమైన దేశభక్తులం అని చెప్పుకుంటుంటే హాస్యాస్పదంగా. వుందన్నారు చిన్న వయస్సులో తన జీవితాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు. సుఖదేవులు ఆశయ సాధనకు అందరూ ప్రతినబునాలని రాంబాబు విజ్గప్తి చేశారు ఈ కార్యక్రమంలో.R రమేష్. టీ నానీ జీ భీమా రావు. శేఖర్ బాలరాజు తది తరులు పాల్గొన్నారు

Also read

Related posts

Share via