సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమారు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుట్రకోణంపై నిందితుణ్ని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
బాధితుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినందున.. ఈ ఘటనలో కుట్రకోణాన్ని వెలికితీయాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఏడు రోజుల కస్టడీకి అనుమతివ్వాలని సింగ్ నగర్ పోలీసులు కోరగా.. సతీష్ను 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలిచ్చారు. న్యాయవాది, తల్లిదండ్రుల సమక్షంలో నిందితుడిని విచారించాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ జరపవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో గురువారం నుంచి శనివారం వరకు నిందితుడిని విచారించనున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025