ఆమెకు మేనమామ అంటే చాలా ఇష్టం. ఇంటికి తరచూ వస్తూ పోతుంటేవాడు. దీంతో మేనకోడల్ని ప్రేమగా చూడటం స్టార్ట్ చేశాడు. దీంతో ఆమెతో చనువు పెరిగింది. మేనకోడలు కదా అని సరసాలు ఆడేవాడు. మేనకోడలు సైతం.
మేనమామ అంటే ఎవరు.. తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని తీసుకుంటాడు. అమ్మమ్మ ఇంటితో బంధం ఎంతగా పెనవేసుకుని ఉంటుందో.. మేనమామతో కూడా అలాంటి సంబంధాన్నే కొనసాగిస్తుంటారు మేనకోడలు, మేనల్లుడు. మేనమామ ఇంటికి వస్తే తమ కోసం ఏదైనా తెస్తాడన్న మనస్థత్వంలో ఉంటారు. అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు. ఇదే చనువును లీనియన్స్ తీసుకున్నాడు మేనమామ. సోదరి కూతురుపైనే కన్నేశాడు ఈ కామాంధుడు. చివరకు ఆమెతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. కానీ చివరకు ఆమె మరొకరితో పెళ్లికి రెడీ అవుతుందని తెలుసుకున్న మామ కోడల్ని కడతేర్చి.. దృశ్యం మూవీ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హర్డోయ్ జిల్లాకు చెందిన మణికాంత్ ద్వివేదికి వివాహం అయ్యింది. అయితే అతడు అక్క కూతురు మాన్సీ పాండేతో చనువు పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. రెండేళ్లుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఇటు తల్లిదండ్రుల కళ్లుగప్పి మాన్సీ, అటు భార్యకు తెలియకుండా మణికాంత్ కొన్ని సంవత్సరాలుగా ఈ సంబంధాన్ని నెరుపుతున్నారు. అయితే ఇటీవల రాఖీ పండుగ రాగా మణికాంత్ ఇంటి వద్ద బాధితురాల్ని ఆమె తండ్రి రాంసాగర్ పాండే దింపాడు. తర్వాత తండ్రి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. మణికాంత్‌కు ఫోన్ చేసి అడిగితే ఓ సారి పారిపోయిందని, మరోసారి ఆమె కనిపించడం లేదని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడు.
దీంతో అనుమానం వచ్చిన రాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాన్సీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాలు వెలుగు చూశాయి. తనకు, మాన్సీకి మధ్య రెండేళ్లుగా ఎఫైర్ ఉందని, ఇప్పుడు తనను కాదని.. మరొకర్ని వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యిందని తెలిసి.. ప్రశ్నించానని చెప్పాడు. నవంబర్ 27న ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడంతో తనతో ఉండిపోవాలంటూ కోరాడు. దీంతో ఆమె నిరాకరించింది. మాట్లాడాలి అంటూ నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి.. గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులను పక్కదోవ పట్టించేందుకు ఆమె ఫోన్ బస్సులో విసిరేశానని నిందితుడు మణికాంత్ వెల్లడించాడు. పోలీసులు మరింత దర్యాప్తు చేపడుతున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం