అయిదేళ్లలో వైకాపా సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆచంట మండలం కొడమండితి గ్రామంలో సంబంధిత అధీకృత అధికారీ సంతరం లేకుండానే ఇళ్ల పట్టాలు జారీ చేసిన వ్యవహారం వెలుగు చూసింది.
ఆచంట(మార్టేరు), అయిదేళ్లలో వైకాపా సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో సంబంధిత అధీకృత అధికారి సంతకం లేకుండానే ఇళ్ల పట్టాలు జారీ చేసిన వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయమై -ఎన్డీయే నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ బాగోతంపై రెవెన్యూ, ఇతర శాఖల యంత్రాంగం క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. గ్రామ స్థాయి ఉద్యోగులు తమ వద్ద ఉన్న జాబితాకు అనుగుణంగా ఆయా పట్టాల పరిశీలన చేపట్టారు. ఇందులో సుమారు 40 పట్టాలకు మండల రెవెన్యూ అధికారి సంతకం లేనట్లుగా గుర్తించారు. ఈ పట్టాలు పొందిన వారిలో అధిక శాతం ఆయా స్థలాల్లో నిర్మాణాలు సైతం చేయడం గమనార్హం. గ్రామంలో సుమారు 319 మందికి వివిధ ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వగా 60కి పైగా ఈ రకమైన బోగస్ పట్టాలు ఉన్నట్లు అంచనా. డిజిటలైజేషన్ చేసి పుస్తకు రూపంలో ఇచ్చిన కొన్నింటిలో పేర్లు మార్పు చేసి ఇచ్చినట్లుగా గుర్తించారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలోనూ పట్టాలు ఇచ్చినట్లు నిర్ధారించారు. రెండు రోజుల్లో పూర్తి లెక్కలు తేలుతాయని ఉద్యోగులు చెబుతున్నారు. సొమ్ము చెల్లించినా తమకు ఎటువంటి స్థలం చూపలేదని అదికారుల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో పలువురు బాధితులు వాపోయారు..
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




