రికార్డు రూములో మద్యం తాగుతున్న సూపరింటెండెంట్
రాత్రి సమయాలలో వ్యభిచారం చేస్తున్నారని ఆరోపణలు
బొబ్బిలి : బొబ్బిలి ఇరిగేషన్ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది. ఇరిగేషన్ రికార్డులను భద్ర పరుచుకునే రూమ్ ఇరిగేషన్ కార్యాలయం మేడపై ఉంది. మేడపై ఉన్న రూములో ఇరిగేషన్ సూపరింటెండెంట్ సురేష్ నిత్యం మద్యం సేవిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యూటీ సమయంలో రికార్డు రూములో మద్యం సేవించడంతో తోటి ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సూపరింటెండెంట్ తప్పులను ప్రశ్నిస్తే భయపెడుతున్నారని ఉద్యోగులు గుసగుసలు ఆడుతున్నారు.
ఉద్యోగులే సర్వర్లు
సూపరింటెండెంట్ సురేష్ మద్యం తాగితే అక్కడ పని చేస్తున్న ఉద్యోగులే మద్యం తాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. మద్యం తాగేందుకు ఏర్పాట్లు చేయకపోతే వేదిస్తారని కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు రూమును బార్ షాపుల మార్చివేసి గ్లాసులు, వాటర్ బాటిల్స్, మద్యం అక్కడ పని చేస్తున్న ఉద్యోగులే సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రాత్రి సమయాలలో వ్యభిచారం
ఇరిగేషన్ కార్యాలయం మేడపైన రాత్రి సమయాలలో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయాలలో మద్యం తాగి వ్యభిచారం చేస్తున్నట్లు చుట్టూ పక్కల ఉన్న వారంతా చెపుతున్నారు. మద్యం సేవించిన సీసాలు, గ్లాసులు, వ్యభిచారం కోసం తెచ్చుకున్న తలగడలు, నిరోధులను ఇళ్లలో పడేయడంతో ఆయా ఇళ్లలో ఉన్నవారు ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని చెపుతున్నారు. ఇరిగేషన్ కార్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





