SGSTV NEWS
CrimeTelangana

ప్రెస్ క్లబ్‌లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC నేతలు తన్నుకున్నారు. సంజీవ రెడ్డి, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరగగా పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ వివాదం జరిగింది.

INTUC Leaders Fight Hyderabad: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో(Basheerbagh Press Club) కాంగ్రెస్(Congress) అనుబంధ సంస్థ ‘ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస’ (INTUC) నేతలు తన్నుకున్నారు. ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ ఘర్షణ జరగగా ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు

వీడియో వైరల్


ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ వివాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది. ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ బటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్‌ను అడ్డుకొని సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ దాడికి పాల్పడ్డాడు. వెంటనే సంజీవరెడ్డి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts

Share this