రెండేళ్ల క్రితం కృష్ణ చైతన్యతో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది బాలికకు. అది కాస్త ప్రేమకు దారి తీసింది. అతడి మాయ మాటలకు పడిపోయింది మైనర్. పెళ్లి పేరుతో ఆమెను ఓయో రూంకి తీసుకు వెళ్లి.. అక్కడ బంధించి..
చేతిలో స్మార్ట్ ఫోన్.. కావాల్సినంత ఇంటర్నెట్.. టైం పాస్ కావడానికి సోషల్ మీడియా యాప్స్.. ఇవి చాలు యూత్ పాడైపోవడానికి, బాగుపడటానికి. ఈ రోజుల్లో మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నారు టీనేజర్స్. చదువు, సంధ్యను పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడుతూ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు కొందరు. మరికొందరు రీల్స్, షాట్స్ అంటూ ఫేమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొంత మంది యువతది మరో దారి.. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, స్నేహం, ప్రేమ అనే ముగుసులో పడి ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక ఇదే ట్రాపులో పడి.. ఓ వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో నమ్మించి.. ఆమెను ఓయో రూంకి తీసుకెళ్లి 20 రోజుల పాటు బంధించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
నిజామాబాద్‌కు చెందిన ఓ మైనర్ బాలికకు మహబూబ్ నగర్‌కు చెందిన కృష్ణ చైతన్యతో రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆమెను ప్రేమించానని.. నీవు లేకపోతే తాను లేనంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయితే మధ్యలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రిలేషన్ కట్ అయ్యింది. అయితే ఆమె కాలేజీ వద్దకు వెళ్లి.. మళ్లీ మామూలుగా మాట్లాడాలంటూ బతిమాలాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, తనతో వచ్చేయమని, బాగా చూసుకుటానంటూ మాయ మాటలు చెప్పాడు. అది నిజమేనని నమ్మిన బాలిక.. అతడి వెంట హైదరాబాద్ వచ్చేసింది. ఇద్దరు కలిసి హైదరాబాద్ నారాయణ గూడలోని ఓయో హోటల్.. గణేష్ రెసిడెన్సీలో దిగారు. తామిద్దరికి పెళ్లి అయ్యిందని చెప్పి.. ఒకటి, రెండు రోజులు ఉంటామని చెప్పి.. రూం తీసుకున్నాడు కృష్ణ చైతన్య.
ఆగస్టు 16వ తేదీన ఆమెను ఓయో రూంకి తీసుకు వచ్చాడు దుర్మార్గుడు కృష్ణ చైతన్య. తీసుకు వచ్చిన తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను 20 రోజుల పాటు హోటల్ రూంలో బంధించి.. తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో.. బాలిక ఫోన్ అమ్మేసి.. హోటల్ రూంకు డబ్బులు కట్టి తన పశువాంఛను ఆమెపై ప్రదర్శించాడు. ఆమె పదే పదే పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ.. పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన అవసరం తీరిపోయాక.. తాను పోషించలేని తెలుసుకున్నాక.. ఆమెను ఇక పెళ్లి చేసుకోలేను తెగేసి చెప్పాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆమె స్థానికుల సాయంతో ఫోన్ తీసుకుని.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే షీటీమ్.. బాధితురాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడ్ని అరెస్టు చేసి.. రిమాండుకు తరలించారు. అయితే బాధితుడిది కూడా 20 సంవత్సరాల లోపు వయస్సు అని పోలీసులు వెల్లడించారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..