July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఫేస్ బుక్ లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!



ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ. లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్ వి టీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు.

జీడిమెట్ల: ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ. లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల అయోధ్యనగర్కు చెందిన వంశీకృష్ణగౌడ్ లిఫ్ట్ టెక్నీషియన్గా పనిచేసేవాడు. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా మధ్యప్రదేశ్కు చెందిన విశాల్యాదవ్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన వద్ద ఆయుధాలు ఉన్నాయని, విక్రయిస్తానని విశాల్యాదవ్ చెప్పాడు. హైదరాబాద్లో డిమాండ్

ఉంటుందని చెప్పడంతో తనకు ఓ పిస్తోల్ కావాలని వంశీకృష్ణగౌడ్ అడిగాడు. అందుకు రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నారు. తొలుత ఫోన్ పే ద్వారా రూ.19 వేలు చెల్లించాడు. మార్చి 6న ఖాజీపేట రైల్వేస్టేషన్ వద్దకు పిస్తోల్ తీసుకొచ్చినట్లు అతను చెప్పాడు.

వంశీకృష్ణగౌడ్ బైక్ పై అక్కడికెళ్లి మిగతా డబ్బు ఇచ్చి పిస్తోల్ తీసుకొని అయోధ్యనగర్ కు వచ్చాడు. ఎవరు కొనుగోలు చేస్తారని ఆరా తీయడం మొదలుపెట్టాడు. బుధవారం సాయంత్రం అయోధ్యనగర్ నుంచి వెళ్తుండ చింతల్లో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఆపారు. సోదా చేయగా బైక్ లో పిస్తోల్ కనిపించింది.దాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via