April 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

అయ్యో పాపం.. రిజల్ట్స్‌కు భయపడి పురుగుల మందుతాగి సూసైడ్.. కట్ చేస్తే పాస్

గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఫలితాలు వచ్చిన తర్వాత అతడు 391 మార్కులతో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. గత నెలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ఈ నెల ఏప్రిల్ 22న రిజల్ట్స్ వచ్చాయి. ఈ పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు పెరిగిపోయాయి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు.. ఫెయిల్ అయ్యామని ఇంకొందరు.. పాస్ అవ్వమనే ఉద్దేశంతో రిజల్ట్స్‌కు ముందే చనిపోయిన వారు ఇంకొందరు.

ఇలా రాష్ట్రవ్యా్ప్తంగా పలు జిల్లాల్లో ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 6 గురు విద్యార్థులు సూసైడ్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో ఓ విద్యార్థి రిజల్ట్స్ రాకముందే సూసైడ్ చేసుకుని మరణించాడు. తీరా ఫలితాలు వచ్చాక అతడు పాసయ్యాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రిజల్ట్స్ రాకముందే సూసైడ్
గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. అయితే పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఏప్రిల్ 22న ఫలితాలు వచ్చిన తర్వాత అతడు 391 మార్కులతో పాసయ్యాడు.


దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని 6గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. హైదరాబాద్ లో ముగ్గురు, మేడ్చల్ పరిధిలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

Also read

Related posts

Share via