April 15, 2025
SGSTV NEWS
Crime

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య



భోగాపురం(విజయనగరం జిల్లా) : ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. భోగాపురం ఎస్‌ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం. ముంజేరు గ్రామానికి చెందిన మొగసాల శ్రావణి (19) విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె ఫెయిల్‌ అయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థిని తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పాపారావు తెలిపారు

Also read

Related posts

Share via