తాండూరు రూరల్: పాముకాటుతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండల పరిధిలోని ఓగిపూర్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విట్టల్ రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం అల్లాకోట్ కు చెందిన ఎడెల్లి రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఓగిపూర్ సమీపంలోని నాపరాతి క్వారీల వద్ద నివాసముంటున్నారు. అక్కడే పాలిషింగ్ యూనిట్లో కార్మికుడిగా పని చేస్తున్నారు. రవి కూతురు పూజ(16), జినుగుర్తి సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది.
సెలవులు ఉండటంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి 1 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పూజ కుడికాలును పాము కాటేసింది. వెంటనే పూజ ఆరవడంతో తల్లిదండ్రులు లేచి చూడగా పాము కనిపించింది. పూజను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూజ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రం బీదర్ కు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025