కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో
ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది.
ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్తో బైక్పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.
వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.
హత్యా? పరువు హత్యా.?
సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్ణవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో