November 21, 2024
SGSTV NEWS
CrimeNational

గ్రామాలపై విరుచుకుపడుతున్న తోడేళ్లు.. నెలన్నర రోజుల్లో ఏడుగురు బలి.. ఎక్కడంటే..

దాదాపు 30 గ్రామాల్లో తోడేళ్లు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.. తోడేళ్ళు ఏదో ఒక గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేస్తున్నాయి. ఆరు బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను తమ ఆహారంగా చేసుకుంటాయి. తోడేలును పట్టుకోవడంలో అధికారుల ప్రయత్నాలు ఫలించటం లేదు..


ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. మనుషులను తినే తోడేళ్ల నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామంటున్నారు. గత ఒకటిన్నర నెలలో ఏడుగురిని ఈ తోడేళ్లు పొట్టపెట్టుకున్నాయి. ఇప్పుడు మరో మహిళను కూడా చంపేశాయి. కాగా ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా సదర్ రేంజ్ లో గత నెలన్నర రోజులుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు 7 మంది చనిపోయారు. ఇందులో కొంతమంది అమాయక పిల్లలు కూడా ఉన్నారు. జిల్లాలోని హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 30 గ్రామాల్లో తోడేళ్లు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.. తోడేళ్ళు ఏదో ఒక గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేస్తున్నాయి. ఆరు బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను తమ ఆహారంగా చేసుకుంటాయి. తోడేలును పట్టుకోవడంలో బహ్రైచ్ అటవీ శాఖ బృందం విఫలమైంది. దీంతో శ్రావస్తి జిల్లా అటవీ సిబ్బంది సహాయం కోరగా, ఆ టీమ్‌ రంగంలోకి దిగారు.

తోడేళ్ల దాడిలో చిన్నా పెద్దా గాయపడుతున్నారు. అమాయకపు చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి. నిరంతర తోడేళ్ల దాడుల దృష్ట్యా, బారాబంకి, లక్నో అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. బహ్రైచ్‌లో డీఎఫ్‌ఓగా ఉన్న ఆకాశ్‌దీప్ బధవాన్‌ను కూడా బారాబంకి నుంచి పిలిపించారు. బహ్రైచ్ జిల్లా మేజిస్ట్రేట్ మోనికా రాణి పర్యవేక్షణలో 16 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ అధికారులంతా షిప్టుల వారీగా రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారు.

Also read

Related posts

Share via