ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాదం.. పూజారులతో సహా 13 మంది ఆహుతి
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో సోమవారం ఉదయం (మార్చి 25) అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో గర్భగుడిలో భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు పూజారులతో సహా మరో ఎనిమిది మంది భక్తులకు మంటలు వ్యాపించి, తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ..
భోపాల్, మార్చి 25: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో సోమవారం ఉదయం (మార్చి 25) అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో గర్భగుడిలో భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు పూజారులతో సహా మరో ఎనిమిది మంది భక్తులకు మంటలు వ్యాపించి, తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆలయ గర్భగుడి గోడలు, పైకప్పుకు వెండి తాపడం ఉంది. ప్రతి సంవత్సరం హోలీ నాడు బాబా మహాకాల్‌కి ధూలెండి సమర్పిస్తారు. ఈ ఏడాది గర్భగుడి గోడలకు రంగు అంటుకోకుండా శివలింగంపై ప్లాస్టిక్ రేకులు వేశారు. సోమవారం ఉదయం భస్మ హారతి సమయంలో మహాకాల్‌కి గులాల్ సమర్పిస్తున్నప్పుడు ఆలయ గర్భగుడిలో అర్చకులు ఒకరికొకరు అభయహస్తం సమర్పిస్తుండగా హారతి పళ్లెంలో మండుతున్న కర్పూరంపై ధూలెండి పడి మంటలు చెలరేగాయి. ధూలెండి కారణంగా గర్భగుడిలో ఉన్న ప్లాస్టిక్ కవర్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో శివలింగంపై ఉన్న రేకులు కూడా మంటలు వ్యాపించాయి. అయితే కొద్దిసేపటికే మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.
గర్భగుడిలో ఉన్న పూజారులు, భక్తుల రసాయనాలతో కూడిన రంగుల తాకిడికి మంటలు మరింతగా వ్యాపించాయి. దీంతో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని పూజారి ఆశిష్ చెప్పారు.ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, ఆలయం వద్ద ఉన్న భక్తులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ‘గర్భగృహ’లో భస్మ హారతి సందర్భంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. వారికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని జిల్లా అధికారి నీరజ్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు.
తాజా ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఈరోజు ఉదయం భస్మహారతి సమయంలో అనుకోకుండా ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అంతా కంట్రోల్‌లో ఉంది. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నాని’ ఆయన తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం మోహన్ యాదవ్‌తో మాట్లాడినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. గాయపడినవారికి చికిత్స అందించేందుకు స్థానిక అధికారులు సహాయం చేస్తున్నారని ఎక్స్ వేధికగా వెల్లడించారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..