ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సీబీఐ ఆఫీసర్‌పై ఓ వ్యక్తి బాణంతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హజ్రత్‌గంజ్‌లోని కిషోర్ రోడ్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగా.. సీబీఐ ASI వీరేంద్ర సింగ్‌పైకి బాణం వదిలి, నేలకేసి పడేశాడు. అక్కడున్న వారందరినీ భయాందోళనకు గురి చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సీబీఐ ఆఫీసర్‌పై ఓ వ్యక్తి బాణంతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హజ్రత్‌గంజ్‌లోని కిషోర్ రోడ్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగా.. సీబీఐ ASI వీరేంద్ర సింగ్‌పైకి బాణం వదిలి, నేలకేసి పడేశాడు. అక్కడున్న వారందరినీ భయాందోళనకు గురి చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది బీహార్‌లోని ముంగేర్ జిల్లా ఖడగ్‌పూర్‌కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి దినేష్ ముర్ముగా గుర్తించారు పోలీసులు.
1993లో నిందితుడు దినేష్ ముర్ము సీబీఐ జరిపిన దర్యాప్తులో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటి సీబీఐ విచారణకు నేతృత్వం వహించిన వీరేంద్ర సింగ్‌పై దినేష్ ద్వేషాన్ని పెంచుకున్నాడు. దినేష్ జరిపిన దాడిలో సీబీఐ ASI వీరేంద్ర సింగ్ ఛాతీ ఎడమ వైపు ఐదు సెంటీమీటర్ల గాయం అయింది. బాణం దాడిలో గాయపడ్డ వీరేంద్రను లక్నో సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణం కుడి వైపుకు కొద్దిగా తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





