December 3, 2024
SGSTV NEWS
CrimeNational

Tamil Nadu: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కారు.. తొంగి చూస్తే, ఐదుగురి మృతదేహాలు..!

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పుదుకోట్టై సమీపంలో కారులో ఆత్మహత్య చేసుకున్నారు.

తమిళనాడులో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పుదుకోట్టై సమీపంలో కారులో ఆత్మహత్య చేసుకున్నారు. పుదుకోట్టై జిల్లా పుదుకోట్టై సమీపంలోని ఇలంగుడిపట్టి సమీపంలోని తిరుచ్చి – కరైకుడి మధ్య జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారు నుండి 5 మంది, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఐదుగురు సేలం జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని విచారణలో తేలింది. మణికందన్, అతని తల్లి సరోజ, భార్య నిత్య, కుమారుడు తీరన్, కుమార్తె నిగరిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వేలిముద్రలు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురి మృతదేహాలను మూడు అంబులెన్స్‌లలో పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట్టై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. వ్యాపారంలో నష్టం రావడంతో మణికందన్‌ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులకు సమాచారం అందింది. కారులో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share via