November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ప్రభుత్వ ఆసుపత్రికెళ్లిన ఇద్దరు మహిళలు.. కట్ చేస్తే.. చెక్ చేస్తానంటూ గది లోపలికి తీసుకెళ్లి.. ఛీ.. ఛీ..

కోల్‌కతాలో అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.. నైట్ డ్యూటీలో ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై దుర్మార్గుడు అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే.. మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది.. కోల్ కతా ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలోనే.. ఒడిశాలోని కటక్‌లోని ప్రభుత్వాసుపత్రిలో రేప్ కేసు వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. ఒడిశాలోని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఇద్దరు మహిళా రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ప్రభుత్వ వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


కటక్ ప్రభుత్వాసుపత్రిలోని కార్డియాలజీ విభాగానికి ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష నిమిత్తం ఇద్దరు మహిళలు ఆదివారం వచ్చారు.. దీంతో డాక్డర్ వారిని పిలిచి మాట్లాడాడు.. అనంతరం మహిళలను పరీక్షల నిమిత్తం లోపలికి తీసుకెళ్లిన వైద్యుడు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మహిళలు తెలిపారు. మంగళ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఇద్దరు రోగుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేశామని కటక్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ) అనిల్ మిశ్రా తెలిపారు. దీనిపై విచారణకు ప్రభుత్వం కమిటీని వేయనుంది. వైద్యులపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నిందితుడిని రోగుల బంధువులు కొందరు కొట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయమై పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు.

రంగంలోకి దిగిన సీబీఐ..
అదేవిధంగా, ఇటీవల కోల్‌కతాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది.. కోల్‌కతా డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం కోల్‌కతాలో విచారణ చేపట్టనుంది. క్రైమ్‌ సీన్‌ను ఈ టీమ్‌ సందర్శించి ఆధారాలు సేకరించనుంది. మరో వైపు తమ డిమాండ్లన్నీ నెరవేర్చనంత వరకు నిరసనలు కొనసాగుతాయని కోల్‌కతా RG ఖర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. కోల్‌కతా డాక్టర్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో డాక్టర్లు విధులు బహిష్కరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు కోల్‌కతా డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా హామీ ఇవ్వడంతో నేటి నుంచి తలపెట్టిన విధుల బహిష్కరణ నిర్ణయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్ రెసిడెంట్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ విరమించుకుంది

Also read

Related posts

Share via