July 1, 2024
SGSTV NEWS
CrimeNationalViral

బాబోయ్‌ కుక్కలు.. లిఫ్ట్‌లో దూరి బాలికపై దాడి చేసిన శునకం.. షాకింగ్‌  వైరల్‌

ఈ ఘటనతో ఆ బాలిక ఒక్కసారిగా భయంతో వణికిపోతూ కనిపించింది. లిఫ్ట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ చిన్నారి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సొసైటీ లేదా పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఈ పెంపుడు కుక్క ఇంతకుముందు టవర్ 2లోని ఫ్లాట్ నంబర్ 201లో ఉన్న మహిళను కూడా కరిచిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పల్లెల్లు, పట్టణాలు అనే తేడా లేకుండా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు, హౌసింగ్‌ సోసైటీల్లోనూ కుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది. నోయిడాలోని సెక్టార్-107లోని లోటస్ సొసైటీలో చిన్నారిపై కుక్క దాడి కలకలం రేపింది. సొసైటీ లిఫ్ట్‌లో బాలికపై ఓ పెంపుడు కుక్క దాడి చేసి గాయపరిచింది. లోటస్‌ 300 సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మే 3వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ అవుతోంది. రాత్రి 9 గంటలకు సొసైటీలోని టవర్‌ 2లోని లిఫ్ట్‌ నుంచి బాలిక కిందకు వస్తోంది. రెండో అంతస్తులో లిఫ్ట్ డోర్ తెరవగానే ఒక్కసారిగా కుక్క లోపలికి వచ్చి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఓ బాలిక లిఫ్ట్‌లో వెళ్తుంటుంది. అప్పుడు లిఫ్ట్‌ ఒక ఫ్లోర్‌లో ఆగడంతో అందులోకి ఓ కుక్క దూరింది. అప్పటికే లిఫ్ట్‌లో ఉన్న బాలికపై దాడి చేస్తుంది. అంతలోనే ఓ వ్యక్తి ఆ కుక్కను అక్కడి నుంచి తరిమి కొట్టాడు. ఈ దాడిలో బాలికకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ బాలిక ఒక్కసారిగా భయంతో వణికిపోతూ కనిపించింది. లిఫ్ట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ చిన్నారి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సొసైటీ లేదా పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

ఈ పెంపుడు కుక్క ఇంతకుముందు టవర్ 2లోని ఫ్లాట్ నంబర్ 201లో ఉన్న మహిళను కూడా కరిచిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పెంపుడు కుక్క ఎలాంటి భద్రత లేకుండా లాబీలో తిరుగుతుందని, లిఫ్ట్ డోర్ తెరవగానే లోపలికి ప్రవేశించి దాడి చేస్తుందని బాధిత బాలిక కుటుంబీకులు తెలిపారు. నోయిడాలో డాగ్ పాలసీ అమల్లో ఉంది. పెంపుడు కుక్కను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మూతి కవర్‌ చేయాలని డాగ్ పాలసీలో స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు. అయినప్పటికీ ఎవరూ వాటిని పట్టించుకోవటం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts

Share via