SGSTV NEWS
CrimeNational

Lord Jagannath: తన తొడపై జగన్నాథుడి బొమ్మను టాటూ వేయించుకున్న విదేశీ మహిళ.. వివాదంపై ఏం చెప్పిందంటే



ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం పూరి నగరంలో కొలువైన జగన్నాథుడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. జగన్నాథుడు ఆలయం మాత్రమే కాదు రథయాత్ర కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. అయితే తాజాగా శ్రీ జగన్నాథ స్వామి బొమ్మను ఒక విదేశీ మహిళ తన తొడపై టాటూగా వేయించుకుంది. అంతేకాదు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జగన్నాథుడు కలియుగంలో పిలిస్తే పలికే తమ ఆరాధ్య దైవం అని అన్నారు. శరీరంలో ఆయన చిత్రాన్ని అది కూడా తొడపై టాటూ వేయించుకోవడం తమ మత విశ్వాసానికి అవమానమని నిసరణ వ్యక్తం చేస్తున్నారు.


ఒడిశాలో శ్రీ జగన్నాథుడికి సంబంధించిన ఒక విషయంలో వివాదం నెలకొంది. ఒక విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మను టాటూగా వేయించుకుంది. దీనిపై స్థానిక ప్రజలు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుని బొమ్మను టాటూగా వేయించుకుని.. అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


దీనిపై భక్తులు, హిందూ మత సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒడిశాలో జగన్నాథుడు మహిమ కలిగిన దైవం అని ప్రజలు నమ్ముతారు. అందువల్ల శరీరంలోని అటువంటి భాగంలో దేవుడి చిత్రాన్ని టాటూగా వేయించుకోవడం తమ విశ్వాసానికి అవమానమని అంటున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హిందూ సేన భువనేశ్వర్‌లోని షహీద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిని హిందూ మత విశ్వాస ఉల్లంఘనగా అభివర్ణిస్తూ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.




హిందూ సేన సభ్యుడు ఒకరు ఈ విషయంపై నిరసన తెలుపుతూ.. జగన్నాథుడు తమకు అత్యంత ప్రియమైన దైవం అని అన్నారు. రాకీ టాటూ 4.5 కోట్ల ఒడిశా నివాసితుల భావోద్వేగాలతో ఆడుకున్న తీరుని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆ పచ్చబొట్టును వెంటనే తొలగించాలని, రాకీ శ్రీ జగన్నాథుని ఆలయం దగ్గరకు వెళ్లి శ్రీ జగన్నాథునికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తొడపై ఉన్న పచ్చబొట్టు వేసుకుని మనోభావాలతో ఆడుకున్నందుకు క్షమాపణ చెప్పాలని అన్నారు.


ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. మతపరమైన చిహ్నాల పట్ల మరింత సున్నితత్వం చూపాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించాలని నెటిజన్లు, మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సంఘటన సీరియస్ గా మారడంతో ఆ విదేశీ మహిళ తన తప్పును అంగీకరించింది. తన తప్పును ఒప్పుకుంటూ ఒక వీడియో విడుదల చేశాడు. దీనితో పాటు ఆమె ఒడిశా ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పింది. ఆ మహిళ క్షమాపణ చెప్పిన తర్వాత వివాదం సర్దుమనిగింది

Also read

Related posts