ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు వావీవరసలు మరిచి ప్రవర్తిస్తూ మానవసంబంధాలను మంటగలుపుతున్నారు. పెళ్లైనా ఇతరులతో సంబంధాలు పెట్టుకొని అడ్డు చెప్పిన భాగస్వాములను హత్య చేసి అంతకులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వెలుగు చూసింది. అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.
అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… సిధ్‌పూర్ నివాసి అయిన 20 ఏళ్ల శివానికి 2018లో ప్రమోద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్నేళ్లకు ప్రమోద్‌కు తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఇలా గొడవలు జరిగిన ప్రతిసారి ప్రమోద్, శివానిపై దాడికి పాల్పడేవాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.
అయితే ఇదే విషయంపై ఇటీవల ప్రమోద్, శివాని మధ్య వివాదం తలెత్తింటి దీంతో ప్రమోద్, అతని అత్తతో కలిసి శివానిపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న 20 ఏళ్ల శివాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఈ హత్య తర్వాత, ప్రమోద్, అతడి అత్తలకు సంబంధించిన అనేక అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో వివాహేతర సంబంధం కారణంగా ప్రమోదే శివానికి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోద్, అతని అత్త కోసం గాలింపు చేపట్టారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!