SGSTV NEWS
CrimeNational

Viral: సెల్ఫీ దిగుదాం అంటూ నది పక్కన బైక్ ఆపమన్న భార్య.. ఆపాక దిమ్మతిరిగే ట్విస్ట్

 



కర్ణాటకలోని యాద్గిర్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ తన భర్తతో కలిసి కృష్ణా నది పక్కనున్న మార్గం గుండా ప్రయాణిస్తోంది. ఇంతలో లొకేషన్ బాగుందని.. సెల్ఫీ దిగుదామని భర్తను కోరింది. అతను బైక్ ఆపిన తర్వాత ఇద్దరూ కలిసి సెల్ఫీ కోసం వంతెన చివరకు వెళ్లారు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే…


కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ భార్య సెల్ఫీ ముచ్చట… షాకింగ్ ట్విస్టుతో ముగిసింది. కృష్ణా నది ఒడ్డున బైక్‌పై దంపతులు వెళ్తున్నారు. ఆ సమయంలో భార్య  “లొకేషన్ బాగుంది, ఓ ఫొటో తీసుకుందాం” అని భర్తను కోరింది. ఆమె ముచ్చట ఎందుకు కాదనాలి అని అతను బైక్ ఆపాడు. ఇద్దరూ కలిసి వంతెన చివరికి నడుచుకుంటూ వెళ్లారు. కానీ అక్కడే ప్రారంభమైంది అసలైన డ్రామా. సెల్ఫీ దిగుతున్న క్షణాన… భార్య భర్తను ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. ఆపై అతను ప్రమాదవశాత్తూ జారిపడ్డాడంటూ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పింది.

అయితే ఆ వ్యక్తి అదృష్టం బాగుండటంతో… ఓ బండరాయిని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. ఆపై తాడు వేసి స్థానికులు అతన్ని బయటకు లాగారు. పైకి వచ్చిన తర్వాత తన భార్యే నన్ను నదిలోకి తోసిందని చెప్పడంతో… ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం రేపింది. పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు

Also read

Related posts

Share this