March 13, 2025
SGSTV NEWS
CrimeNationalViral

14 ఏళ్ల బాలికకు పెళ్లి.. పశువును లాక్కెళ్లినట్లు బలవంతంగా కాపురానికి లాక్కెళ్లారు! సంచలనం సృష్టిస్తున్న ఘటన



కర్ణాటకలో 14 ఏళ్ల బాలికను 38 ఏళ్ల వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకుని కాపురానికి తీసుకెళ్ళిన ఘటన వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. బాలిక ఎంత చెబుతున్నా వినకుండా తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

బాల్య వివాహాలపై ఎన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నా, ఎన్ని చట్టాల తెస్తున్నా.. ఎక్కడో ఒక చోటు చిన్నపిల్లలు పెళ్లిళ్ల పేరుతో బలవుతున్నారు. నాకీ పెళ్లి వద్దు అని మొత్తుకుంటున్నా ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. ఈ దారుణ కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకలోని హోసూర్‌కు చెందిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఓ 14 ఏళ్ల అమ్మాయిని ఓ 38 ఏళ్ల వ్యక్తి బలవంతంగా తీసుకెళ్తున్నాడు, అతని వెనుక ఒక మహిళ కూడా ఉంది. ఆ అమ్మాయిని వాళ్లు బలవంతంగా కాపురానికి తీసుకెళ్తున్నారు. హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక. స్థానిక పాఠశాలలో 7వ తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది.

అయితే ఆమెకు కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన 29 ఏళ్ల కూలీ మాదేష్‌తో వివాహం చేశారు తల్లిదండ్రులు. నాకీ పెళ్లి వద్దు అని బాలిక ఎంత చెప్పినా వాళ్లు వినలేదు. అయితే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత బాలిక తన స్వస్థలం తిమ్మత్తూరుకు వచ్చేసింది. అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది. ఆ బాలిక ఎంత చెప్పినా కూడా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అస్సలు వినలేదు. ఆ బాలికను పెళ్లి చేసుకున్న మాదేష్, అతని అన్నయ్య మల్లేష్ (38) ఆ అమ్మాయిని బంధువుల ఇంటి నుండి కాలికుట్టై గ్రామానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలిక అరుస్తూ కేకలు పెట్టినా వాళ్లు వినిపించుకోలేదు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ దృశ్యాలను ఎవరో సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసిన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డెంకనికోట్టైలోని ఆల్-ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. అలాగే బాలిక అమ్మమ్మ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.

బుధవారం, పోలీసులు మాదేష్, అతని సోదరుడు మల్లేష్, అతని భార్య, బాలిక తల్లి నాగమ్మ, తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేసి, వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ బాలిక ఇప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళ వివాహం చట్టవిరుద్ధం, బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం అలాంటి వివాహాలు చెల్లవు. మైనర్ల మధ్య బాల్య వివాహాలను చేయడం, మేజర్లతో మైనర్ల వివాహం చేయడం కూడా చట్టరిత్యా నేరం. ఇలా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో బాల్య వివాహాలు ఇప్పటికీ విస్తృతంగా జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2023-2024లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కర్ణాటకలో 180 బాల్య వివాహాల గురించి అధికారులకు సమాచారం అందింది. వాటిలో 105 వివాహాలను అడ్డుకున్నారు అధికారులు

Also read

Related posts

Share via